శ్రీలంకను తన బౌలింగ్ తో దడదడలాడించిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. తన బంతుల్లో ఎంత వేడి ఉందో మనసు అంత చల్లన అని నిరూపించాడు. తనకు దక్కిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’లో భాగంగా 5,000 డాలర్లను గ్రౌండ్స్ మెన్ కు అందించాడు. ఈ నిర్ణయంపై ఆటగాళ్లందరితోపాటు క్రికెట్ విశ్లేషకులు గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ అంతా సిరాజ్ ను అభినందించారు. నిజానికి ఆసియా కప్ ఈ మేరకైనా జరిగిందంటే అందుకు ప్రధాన కారణం గ్రౌండ్ లో పనిచేసిన వర్కర్లే. ఈ టోర్నమెంట్ మొత్తానికి వర్షం బెడద చుట్టుకోగా.. ఎప్పటికప్పుడు స్టేడియాన్ని ఆరబెడుతూ ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. ఇంచుమించు ప్రతి మ్యాచ్ కు ఇదే పరిస్థితి ఎదురైంది.
సాధారణంగా ఏ స్టేడియంలోనూ ఇంత పెద్దస్థాయిలో గ్రౌండ్స్ మెన్ కనపడరు. కానీ కొలంబోలోని స్టేడియంలో పదుల సంఖ్యలో వర్కర్లు కనపడ్డారు. ఇప్పుడు సిరాజ్ కు ప్రకటించిన మొత్తాన్ని అందించడం ద్వారా ఈ పేస్ బౌలర్ మంచి నిర్ణయం తీసుకున్నట్లయింది. శ్రీలంకను చావు దెబ్బ కొట్టిన బాధలో ఉన్న ఆ దేశానికి చెందిన వ్యక్తులకే మొత్తాన్ని అందించడం ఆటకే హైలెట్ గా మారింది.
Great man.