ఆడిలైడ్(Adelaide)లో జరిగిన రెండో టెస్టు రెండో రోజున ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తో తలెత్తిన వివాదంలో పేసర్ మహ్మద్ సిరాజ్ భారీగా ఫైన్ చెల్లిస్తున్నాడు. ట్రావిస్ ఔటయిన తర్వాత పెవిలియన్ వైపు చేయి చూపిస్తూ సిరాజ్ ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఆ ఇద్దరూ ప్రవర్తనా నియమామళి ఉల్లంఘించారన్న ICC.. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ తోపాటు 1 డీమెరిట్(Demerit) పాయింట్ విధించింది. ఆటగాణ్ని తిట్టారనే కారణంతో డీమెరిట్ పాయింట్లు రావడం సిరాజ్ కు ఇదే తొలిసారి. ఫైన్ కింద సిరాజ్ భారీగా 16,500 ఆస్ట్రేలియా డాలర్లు(రూ.8,95,340) చెల్లిస్తాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక రాసింది.
రూ.9 లక్షల ఫైన్ కడుతున్నాడంటే ఒక్కో మ్యాచ్ కు ఆటగాడికి ఎంతొస్తుందనేగా. వాస్తవానికి టెస్టు ఫీజులు పెంచాలని గతేడాదే ICC భావించింది. అయితే ICC పెంచే మొత్తం కన్నా ఎక్కువగా ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చెల్లిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్లో రాణించేవాళ్లను ప్రోత్సహించేలా BCCI.. క్యాలెండర్ ఇయర్ ప్రకారం వేతనాలు ఇస్తోంది. అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు గల ఇయర్లో 75 శాతం టెస్టులాడే ప్లేయర్ కు ఇంచుమించు ఒక్కో మ్యాచ్ కు రూ.45 లక్షల దాకా చెల్లిస్తోంది. 50 నుంచి 75 శాతం మ్యాచులాడేవారికి రూ.30 లక్షలు, టీంకు సెలెక్టయినా ఆడే ఛాన్స్ రాని వారికి రూ.15 లక్షల బోనస్ అందజేస్తుంటుంది.