
బంతి పైకి లేస్తే సిక్స్, కింద నుంచి వెళ్తే బౌండరీయే అన్నట్లు వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రతాపం చూపించాడు. 53 బంతుల్లోనే 9 సిక్సులు, 5 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. అతడి ధాటికి అండర్-19 వన్డే ఆసియా కప్ లో UAE బౌలర్లు తేలిపోయారు. ఇక భారత స్కోరు బోర్డు ఏడున్నర రన్ రేట్ కు పైగా దూసుకుపోగా ఒకానొక దశలో 8 దాటింది. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. సెంచరీకి ఇంకో 16 బాల్స్ మాత్రమే తీసుకున్నాడు. మరో ఎండ్ లో ఆరోన్ జార్జ్(52 నాటౌట్) నిలకడగా ఆడుతుండటంతో భారీ స్కోరు దిశగా భారతజట్టు దూసుకెళ్తోంది.