
బుమ్రా దెబ్బకు తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఈడెన్ గార్డెన్స్ లో 147కే 7 ప్రధాన వికెట్లు చేజార్చుకున్న సఫారీ జట్టు.. ఇక ఎక్కువసేపు నిలవలేదు. బుమ్రా 5
వికెట్లతో హడలెత్తించాడు. సిరాజ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకోగా, అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు. మార్ క్రమ్(31), రికెల్టన్(23), వియాన్ మల్డర్(24), కెప్టెన్ బవుమా(3), టోనీ డి జోర్జి(24), అంతా తక్కువకే ఔటయ్యారు. సొంతగడ్డపై భారత బౌలర్లు ప్రారంభం నుంచీ రెచ్చిపోయారు. టాప్ ఆర్డర్ లో ఏ ఒక్కరూ నిలవకుండా ఒత్తిడి పెంచారు. పేస్, స్పిన్ దెబ్బను దక్షిణాఫ్రికా తట్టుకోలేకపోయింది.