సొంతగడ్డపై ఇంగ్లండ్(England) దారుణంగా కుప్పకూలింది. దక్షిణాఫ్రికాతో లీడ్స్(Leeds)లో జరిగిన తొలి వన్డేలో 24.3 ఓవర్లలోనే 131కి ఆలౌటైంది. జేమీ స్మిత్(54) మినహా ఎవరూ నిలబడలేదు. అతడి తర్వాత బట్లర్(15)దే హయ్యెస్ట్ స్కోరు. కేశవ్ మహరాజ్ 4, మల్డర్ 3 వికెట్లు తీసుకున్నారు. సౌతాఫ్రికా 20.5 ఓవర్లలోనే 137/3 చేసి 7 వికెట్లతో గెలుపొందింది. 3 మ్యాచుల సిరీస్ లో ఆ జట్టు 1-0తో ఉంది.