పొట్టి ప్రపంచకప్(T20 World Cup)లో దక్షిణాఫిక్రా వరుస విజయాలతో సెమీస్ కు దగ్గరైంది. వరల్డ్ కప్ ఫార్మాట్ అంటేనే అమ్మో అని చేతులెత్తేసే ఆ టీమ్.. ఈసారి మాత్రం మంచి ప్రదర్శనే(Performance) చేస్తున్నది. సూపర్-8లో కంటిన్యూగా రెండో గెలుపు అందుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత 163/6 చేసిన సౌతాఫ్రికా.. ప్రత్యర్థిని 156/6కే కట్టడి చేసి 7 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని దక్కించుకుంది.
డికాక్ హిట్టింగ్…
ఈ మ్యాచ్ లో క్వింటన్ డికాక్(65; 38 బంతుల్లో 4×4, 4×6) ఇన్నింగ్సే హైలెట్. హెండ్రిక్స్(19), క్లాసెన్(8), మిల్లర్(43), మార్ క్రమ్(1), స్టబ్స్(12) చేశారు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుకున్నాడు. మొదట భారీ రన్ రేట్ తో నడిచినా ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు.
కానీ…
ఇంగ్లిష్ జట్టు 61 స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సాల్ట్(11), బట్లర్(17), బెయిర్ స్టో(16), మొయిన్(9) ఔటైతే.. హారీ బ్రూక్(53), లివింగ్ స్టోన్(33) జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో విజయం దిశగా ఇంగ్లండ్ దూసుకుపోయింది. కానీ తొలుత లివింగ్ స్టన్, ఆ తర్వాత బ్రూక్ ను ఔట్ చేయడంతో 7 రన్స్ దూరంలో ఇంగ్లండ్ కథ ముగిసింది.