సొంతగడ్డపైనే ఆస్ట్రేలియా తడబాటుకు గురైంది. వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలై దక్షిణాఫ్రికాకు సిరీస్ అప్పగించింది. రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 277కు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కె(88), ట్రిస్టన్ స్టబ్స్(74) రాణించారు. అనంతరం కంగారూ జట్టు 193కే కుప్పకూలి 84 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. జోష్ ఇంగ్లిస్(87) పోరాడినా మిగతా వాళ్లు నిలవలేదు. లుంగి ఎంగిడి 5 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తో దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది.