పొట్టి ప్రపంచకప్(T20 World Cup) లో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరింది. అఫ్గానిస్థాన్ ను మట్టికరిపించి అపూర్వ విజయంతో సగర్వంగా ఫైనల్ చేరింది. ఆ జట్టు విధించిన టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
మొదట అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్రొటీస్(South Africa).. దుమ్ముదులిపింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది.
డికాక్(5) త్వరగా ఔటైనా హెన్రిక్స్(29), మార్ క్రమ్(23) మరో వికెట్ పడకుండా చూసుకుంటూ 8.5 ఓవర్లలోనే విజయ లాంఛనాన్ని(Formality) పూర్తి చేశారు.