
భారత్ తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) కష్టాల్లో పడింది. ఈడెన్ గార్డెన్స్ లో 147 కే 7 ప్రధాన వికెట్లు చేజార్చుకుంది. బుమ్రా 3 వికెట్లు తీస్తే, కుల్దీప్ యాదవ్, సిరాజ్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. టీమ్ఇండియా బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ నిలవలేకపోయింది. మార్ క్రమ్(31), రికెల్టన్(23), వియాన్ మల్డర్(24), కెప్టెన్ బవుమా(3), టోనీ డి జోర్జి(24), వేరియన్నె(16), మార్కో యాన్సెన్(0) ఇలా.. అంతా తక్కువకే ఔటయ్యారు. ట్రిస్టన్ స్టబ్స్ ఎంతసేపు నిలబడతాడనే దానిపైనే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆశలు ఆధారపడి ఉంటాయి.