గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-8కి దూసుకొచ్చిన దక్షిణాఫ్రికా సెమీస్ రేసులో వెనుకబడ్డ వేళ కీలక మ్యాచ్ లో విజయం సాధించింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో తడబడ్డా చివరకు గెలుపును సొంతం చేసుకుని సెమీఫైనల్లో ప్రవేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 8 వికెట్లకు 135 పరుగులు చేసింది.
వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్ ను డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 17 ఓవర్లలో 123గా నిర్దేశించారు. 16.1 ఓవర్లలో 124/7 చేసిన సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ లో అడుగుపెట్టింది.
మూడు వికెట్లతో…
5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన విండీస్.. ఓపెనర్ కైల్ మేయర్స్(35), రోస్టన్ ఛేజ్(52) అండతో నిలబడింది. టాబ్రెయిజ్ షంసి మూడు వికెట్లతో కరీబియన్ల పతనాన్ని శాసించాడు. స్వల్ప టార్గెట్ అయినా సౌతాఫ్రికా తడబాటుకు గురైంది. 42 స్కోరుకే 3 వికెట్లు పడ్డ టీమ్ ను స్టబ్స్(29), క్లాసెన్(22), మార్కో యాన్సెన్(21) గెలుపు తీరాలకు చేర్చారు.
గ్రూప్-2లో ఇంగ్లండ్ 4 పాయింట్లతో ముందంజ వేసిన దృష్ట్యా.. రన్ రేట్ తక్కువగా ఉండి వెస్టిండీస్ తో గెలవక తప్పని మ్యాచ్ లో విజయం సాధించడమే కాకుండా… గ్రూప్ స్టేజ్, సూపర్-8 దశల్లో అన్నింటికి అన్ని మ్యాచ్ లు గెలిచిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.