ఆరింటికి 5 మ్యాచ్ ల్లో గెలిచి 10 పాయింట్లతో ఒక జట్టు.. నాలుగు విజయాలు, రెండింట్లో ఓటములతో 8 పాయింట్లతో మరో జట్టు.. ఇందులో ఎవరు గెలిచినా సెమీస్ కు దారులు దగ్గర చేసుకున్నట్లే. ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతున్నది. కీలక సమరంగా భావించే ఈ మ్యాచ్ పుణెలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
దక్షిణాఫ్రికా(South Africa) 10 పాయింట్లతో ఉండగా ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ చేరుకున్నట్లే అవుతుంది. అదే న్యూజిలాండ్(New Zealand) విజయం సాధిస్తే మాత్రం ఈ రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉంటాయి. అప్పుడు సెమీస్ రేసు కోసం ఈ ఇరు జట్లతోపాటు మిగతా జట్లు కూడా పోటీనిచ్చే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా 8, పాకిస్థాన్ 6, అఫ్గానిస్థాన్ 6 పాయింట్లతో కంటిన్యూగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.