సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) కొట్టిన ఆల్ రౌండ్(All Round) దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అలసిపోయింది. తొలుత బ్యాటర్ల విధ్వంసం, అనంతరం బౌలర్ల రాణింపుతో హైదరాబాద్ జట్టు బెంగళూరుపై పూర్తి ఆధిపత్యం(Domination) చూపింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన SRH.. 4 వికెట్లకు 287 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన RCBకి దినేశ్ కార్తీక్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు ఓడినా కార్తీక్ దూకుడు అందర్నీ ఆకట్టుకుంది. 7 వికెట్లకు 262 పరుగులకే పరిమితమైన బెంగళూరు.. 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
లక్ష్య ఛేదనలో…
RCBకి ఓపెనర్లు విరాట్ కోహ్లి(42; 20 బంతుల్లో 6×4, 2×6), డుప్లెసిస్(62; 28 బంతుల్లో 7×4, 4×6) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 80 పార్ట్నర్ షిప్ అందించారు. డుప్లెసిస్ 23 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేయగా… తొలి 50 స్కోరుని 23 బాల్స్ లో, 100 మార్క్ ని 7.5 ఓవర్లలోనే రీచ్ అయింది RCB. కానీ ఈ ఇద్దరూ ఔటైన తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లు టపటపా వికెట్లు సమర్పించుకున్నారు.
కానీ…
విల్ జాక్స్(7) దురదృష్టవశాత్తూ రనౌటయితే, రజత్ పటీదార్(9), సౌరవ్ చౌహాన్(0) వెనుదిరిగారు. 100 స్కోరుకు 2 వికెట్లతో ఉన్న RCB కాస్తా 122కే 5 కీలక వికెట్లు కోల్పోయింది. కానీ ఇక ఆ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. దినేశ్ కార్తీక్(83; 35 బంతుల్లో 5×4, 7×6) ఆడిన బంతినల్లా బాదుతుంటే లక్ష్యం అంతకంతకూ కరిగిపోయింది. 23 బాల్స్ లోకే కార్తీక్ 50 పూర్తి చేశాడు.