కళ్లెదుట భారీ టార్గెట్.. కానీ 50కే చేజారిన మూడు వికెట్లు… అంతా ఆశలు వదులుకున్న టైంలో శాంసన్(66; 37 బంతుల్లో 7×4, 4×6), జురెల్(70; 35 బంతుల్లో 5×4, 6×6) రాజస్థాన్ ఆశలు నిలిపారు. కానీ కీలక సమయంలో ఆ ఇద్దరూ ఔటవడంతో కథ ముగిసింది. చివర్లో హెట్ మయర్ షాట్లకు దిగినా అప్పటికే ఓవర్లు తగ్గి రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. కానీ ఉన్నంతసేపు శాంసన్-జురెల్ జోడీ దుమ్ము దులిపింది. సిమర్ జీత్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 0, 2nb, 6, 6, 1w, 6, 1, 4తో మొత్తం 26 పరుగులు పిండుకున్నారు. హెట్ మయర్(42) ఔటవగా, 6 వికెట్లకు 242 పరుగులే చేసిన రాజస్థాన్.. 44 పరుగుల తేడాతో ఓటమి చెందింది.