శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే(Vandersay) రెండో వన్డేలో ‘వండర్’ స్పెల్ వేశాడు. తొలి ఆరింటికి ఆరు వికెట్లను తీసుకుని టీమ్ఇండియాను కోలుకోకుండా చేశాడు. కొలంబోలో జరిగిన మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంక.. 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. తర్వాత భారత్ 42.1 ఓవర్లలోనే 208 పరుగులకు ఆలౌటై 32 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
తొలుత…
నిశాంక(0), ఫెర్నాండో(40), కుశాల్(30), సమరవిక్రమ(14), కెప్టెన్ అసలంక(25), లియనాగె(12), వెల్లాలగె(39), కమిందు(40), ధనంజయ(15) పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీసుకున్నారు.
తర్వాత…
రోహిత్(64), గిల్(35) తొలి వికెట్ కు 97 పరుగులు జోడించారు. వీరి తర్వాత కోహ్లి(14), దూబె(0), శ్రేయస్(7), రాహుల్(0) పెవిలియన్ దారి పట్టారు. ఈ ఆరుగురినీ వాండర్సే ఔట్ చేశాడు. అక్షర్(44) ఉన్నంతసేపూ ఆశలు కనిపించినా అతణ్ని ఔట్ చేసి లంకకు గెలుపునందించాడు అసలంక.
వాండర్సే 6, కెప్టెన్ అసలంక 3 వికెట్లు తీసుకున్నారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ ల సిరీస్ లో లంక 1-0 లీడ్ తో ఉంది. తొలి వన్టే టై అయిన సంగతి తెలిసిందే.