సొంతగడ్డపై లంకేయులు(Sri Lankans) జోరు కొనసాగిస్తున్నారు. టాస్ గెలిచిన అసలంక మరో మాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాప్ ఆర్డర్(Top-Order) రాణించడంతో ఆ జట్టు 7 వికెట్లకు 248 పరుగుల స్కోరు చేసింది. ఆవిష్క ఫెర్నాండో(96) తృటిలో సెంచరీ కోల్పోగా.. కుశాల్ మెండిస్(59), పథుమ్ నిశాంక(45), కమిందు మెండిస్(23 నాటౌట్) రాణించారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ 3 వికెట్లతో మాయ చేశాడు.
తర్వాతే…
గిల్(6) మరోసారి నిరాశపరిస్తే కెప్టెన్ రోహిత్(35; 20 బంతుల్లో 6×4, 1×6) ఉన్నంతసేపు జోరు చూపించాడు. కానీ అతడు కూడా క్యాచ్ అవుట్ గా వెనుదిరగడం.. ముందుకు వచ్చి ఆడబోయిన పంత్(6) స్టంపౌట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కోహ్లి(20), అక్షర్(2), శ్రేయస్(6) సైతం వికెట్లు సమర్పించుకోవడంతో 82కే 6 వికెట్లు కోల్పోయి కనీస పోరాటమే కష్టమైంది.