దక్షిణాఫ్రికా(South Africa)లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. డర్బన్(Durban)లో జరుగుతున్న మొదటి టెస్టులో కేవలం 42 పరుగులకే ఆలౌటై పరువు తీసుకుంది. నిన్న దక్షిణాఫ్రికా 190కి ఆలౌట్ కాగా ఈరోజు లంకేయులు 13.5 ఓవర్లలోనే అత్యంత తక్కువ స్కోరుకే చాపచుట్టేశారు. ఐదుగురు డకౌట్లయితే, ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకున్నారు. పేస్ బౌలర్ మార్కో యాన్సెన్ 7 వికెట్లతో లంక నడ్డివిరిచాడు.
అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా ఆట ముగిసే సమయానికి 123/3తో నిలిచి ప్రస్తుతానికి 273 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టెస్టుల్లో సౌతాఫ్రికాపై అత్యల్ప స్కోరు చేసిన రికార్డును శ్రీలంక నమోదు చేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2013లో కేప్ టౌన్లో జరిగిన టెస్టులో కివీస్ 45 పరుగులకే ఆలౌటైంది. అటు లంకకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం.