క్రికెట్ లో ఓపెనర్ గా తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడిన బ్యాటర్ అతను. కీలక ఇన్నింగ్స్ లు ఆడి భారత్ కు విజయాలు అందించిన ఆ స్టార్ క్రికెటర్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి పోటీచేసిన తొలిసారే MP అయ్యాడు. ఆటతీరులోనే కాదు మాటతీరు(Way Of Talking)లోనూ కనికరం చూపని అతడు ఉన్నట్టుండి రాజకీయాల(Politics)కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. అలాంటి అనూహ్య(Sudden) నిర్ణయం తీసుకున్న ఆ సీనియర్ ప్లేయరే ఢిల్లీకి చెందిన గౌతం గంభీర్.
పదమూడేళ్ల పాటు…
2003 నుంచి 2016 వరకు గౌతమ్ గంభీర్ టీమ్ఇండియాకు ఆడాడు. 2010-11 మధ్య అతడు ఆరు వన్డే మ్యాచ్ లకు కెప్టెన్ గా పనిచేస్తే ఆ ఆరింటిలోనూ భారత్ దే గెలుపు. 2007 టీ20 వరల్డ్ కప్ లో(54 బంతుల్లో 75 పరుగులు).. 2011 వన్డే వరల్డ్ కప్ లో(122 బంతుల్లో 97 పరుగులు) ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ మరచిపోలేం. తన కెరీర్లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడిన గంభీర్.. దేశవాళీల్లోనూ టన్నుల కొద్దీ పరుగులు చేశాడు
ఉన్నట్టుండి గుడ్ బై…
2019 మార్చి 22న భారతీయ జనతా పార్టీలో చేరిన గౌతమ్.. ఆ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బరిలోకి దిగి 6,95,109 ఓట్ల భారీ తేడాతో గెలుపొందాడు. MPగా అందుకునే రెండేళ్ల జీతాన్ని కరోనా కాలంలో సర్కారుకే అందజేసిన అతడు.. వివాదాస్పద కామెంట్స్ చేసిన BJP నేత నుపూర్ శర్మకు మద్దతుగా నిలిచాడు. పొలిటికల్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్యాగ్ చేస్తూ గంభీర్ ట్వీట్ చేశాడు. క్రికెట్ పై దృష్టిసారించేందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని, ఇంతకాలం ప్రజలకు సేవ చేసే అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా కు కృతజ్ఞతలు అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.