భారత్-పాక్ ద్వైపాక్షిక(Bilateral) సిరీస్ పై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే పాక్ తో ఆడతామంటూ… ఆ దేశ యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు. ఈ రెండు దేశాలు చివరిసారిగా 2012-13లో భారత్ లో ఆడాయి. ‘బోర్డర్లో శాంతి నెలకొనేలా ఇరుదేశాల ప్రభుత్వాలు హామీ ఇవ్వాలి.. మాకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.. చర్చలు జరపటం చాలా సులభం.. కానీ సరిహద్దుల్లో పదేపదే తలెత్తుతున్న ఉద్రిక్తతలు పాక్ కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాయి.. చాటుమాటుగా ఏం జరుగుతుందో(బ్యాక్ ఛానెల్ కనెక్షన్స్) నాకు స్పష్టంగా తెలుసు.. అక్రమ చొరబాట్ల వల్లే ఆ దేశానికి వెళ్లట్లేదు..’ అని సన్నీ నిర్మొహమాటంగా చెప్పాడు.