రూ.11.25 కోట్లకు దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)కు న్యాయం చేశాడు ఇషాన్ కిషన్. తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్(RR)పై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి సెంచరీ చేశాడు. తొలుత హెడ్(67; 31 బంతుల్లో 9×4, 3×6), ఆ తర్వాత ఇషాన్ వంతు. 45 బంతుల్లోనే అతడు 10 ఫోర్లు, 6 సిక్సులతో సెంచరీ పూర్తిచేశాడు. ఈ ఇద్దరి ధాటికి 6.4 ఓవర్లలోనే స్కోరు 100కు చేరింది. పరుగుల వరద పారించే SRH ఆటగాళ్లు.. మరోసారి అదే దూకుడు చూపించారు. అభిషేక్(24), నితీశ్(30), క్లాసెన్(34) ఉన్నంతసేపూ బ్యాట్ కు పనిచెప్పారు. ఇక ఇషాన్ మ్యాజిక్ మొదలయ్యాక 14.1 ఓవర్లలోనే స్కోరు 200 అయింది.