1/2.. 2/6.. 3/21.. 4/47.. లీగ్ దశలో 250కి పైగా స్కోర్లతో హడలెత్తించిన హైదరాబాద్ ఇదేనా అన్న రీతిలో తుది పోరులో చేతులెత్తేసింది SRH. కోల్ కతా బౌలర్ల ధాటికి 7 ప్రధాన వికెట్లను ఈజీగా సమర్పించుకుంది. 77కే 7 వికెట్లు కోల్పోయి కోలుకోలేని కష్టాల్లో పడింది. KKR బౌలర్లు పోటీ పడి వికెట్లు తీయడంతో 100 స్కోరైనా దాటుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
స్టార్టింగ్ నుంచే…
అభిషేక్ శర్మ(2), ట్రావిస్ హెడ్(0), రాహుల్ త్రిపాఠి(9), ఎయిడెన్ మార్ క్రమ్(20), నితీశ్ కుమార్ రెడ్డి(13), షాబాజ్ అహ్మద్(8), అబ్దుల్ సమద్(4)… ఇదీ సన్ రైజర్స్ ఆటగాళ్ల బ్యాటింగ్ తీరు. క్రీజులో ఉన్న క్లాసెన్(16) అయినా ఆదుకుంటాడనుకుంటే అతడూ చేతులెత్తేశాడు. హర్షిత్ రాణా సూపర్ బాల్ తో బోల్తా కొట్టించిన తీరు ఆకట్టుకుంది. ఇలా 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ టీమ్ పరిస్థితి అయోమయంగా తయారైంది.