IPL-2025లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ గా ఢిల్లీ క్యాపిటల్స్(DC), రాజస్థాన్ రాయల్స్(RR) నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్. ఆ తర్వాత రాజస్థాన్ సైతం దీటుగా పోటీనిచ్చింది. జైస్వాల్(51), నితీశ్ రాణా(51) హాఫ్ సెంచరీలతో విజయానికి చేరువైంది. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సి ఉండగా.. స్టార్క్ 8 రన్స్ ఇవ్వడంతో 188 పరుగులే వచ్చాయి. దీంతో మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్ ఆడించారు. ఈ ఓవర్ ను స్టార్క్ వేయగా, 11/2తో నిలిచింది రాజస్థాన్. కానీ కేవలం 4 బంతుల్లోనే 13 పరుగులు చేసిన ఢిల్లీ.. మ్యాచ్ ను ఎగరేసుకుపోయింది.