అఫ్గానిస్థాన్ తో జరుగుతున్న సూపర్-8 తొలి మ్యాచ్ లో భారత జట్టు మంచి స్కోరే చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 53/1తో ఉన్న టీమ్ కాస్తా రషీద్ ఖాన్ దెబ్బకు 90/4కు చేరుకుంది. కానీ సూర్య మాత్రం అఫ్గాన్ బౌలర్లను ఆడుకుని హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో టీమ్ఇండియా 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
హార్డ్ హిట్టింగ్…
రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(24), రిషభ్ పంత్(20), శివమ్ దూబె(10) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. కానీ హార్దిక్ పాండ్యతో కలిసి సూర్య(53; 28 బంతుల్లో 5×4, 3×6) మంచి పార్ట్నర్ షిప్(Partnership) ఇచ్చాడు. బంతిని బాదడమే లక్ష్యంగా హార్డ్ హిట్టింగ్ కు దిగాడు. కానీ పాండ్య(32; 24 బంతుల్లో 3×4, 2×6) మరోసారి భారీ షాట్ కు యత్నించి(Try) క్యాచ్ ఔట్ అయ్యాడు.
మూడేసి వికెట్లతో…
ఆఖర్లో అక్షర్ పటేల్(12), రవీంద్ర జడేజా(7) కూడా తక్కువకే ఔటవడంతో భారత్ మరింత స్కోరు చేయలేకపోయింది. ఫజల్ హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.