వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కు భారత జట్టును BCCI ప్రకటించింది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా కొత్త బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ ఎంపిక చేసిన మొదటి జట్టు ఇదే. ఐపీఎల్ లో మోస్ట్ టాలెంటెడ్ గా నిలిచిన యంగ్ స్టర్స్ కు జట్టులో చోటు దక్కింది. సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మకు టీమ్ ఇండియాలో ప్లేస్ దొరికింది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్య సెలెక్టవగా, వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. తిలక్ వర్మ తొలిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు ఎంపికయ్యాడు. విండీస్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆగస్టు 3 నుంచి 13 వరకు జరగనుంది. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు జట్లను ప్రకటించగా.. ఇప్పుడు టీ20 టీమ్ ను సైతం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
నలుగురేసి సీమర్లు, స్పిన్నర్లు
విండీస్ కు ఎంపికైన టీమ్ లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, మరో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ సీమర్లు కాగా.. యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ స్పిన్నర్లుగా జట్టులో చోటు సంపాదించారు.
టీ20లకు టీమ్ ఇండియా
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజు శాంసన్(వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్