మొన్న జరిగిన టీ20 ప్రపంచకప్ మాదిరిగానే 2026 టోర్నీని నిర్వహించాలని ICC నిర్ణయించింది. ఆతిథ్య దేశాలతోపాటు ఈ మధ్య జరిగిన ప్రపంచకప్ ఆటతీరు(Performance) ఆధారంగా జట్ల క్వాలిఫై ఉంటుంది. ఈ టోర్నమెంటుకు ఈసారి భారత్, శ్రీలంక సంయుక్తం(Joint)గా ఆతిథ్యమిస్తాయి.
సేమ్ టూ సేమ్…
రెండు ప్రైమరీ రౌండ్స్, నాకౌట్ తరహాలో టోర్నీ జరగనుండగా మొత్తం 20 టీంలు పాల్గొంటాయి. ఇందులో 12 జట్లు నేరుగా(Direct)గా అర్హత పొందుతుండగా.. మరో 8 జట్లు క్వాలిఫై రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక అర్హత సాధిస్తే గ్రూప్ స్టేజ్, సెమీస్ ఆధారంగా 7 జట్లు డైరెక్ట్ గా ప్రపంచకప్ ఆడుతాయి. ఇక మిగతా 3 టీంలు మాత్రం తాజా ICC ర్యాంకుల ఆధారంగా ప్రవేశాన్ని పొందుతాయి.
డైరెక్ట్ గా క్వాలిఫై అయిన దేశాలివే…: భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, అమెరికా
ర్యాంకులతో క్వాలిఫై అయిన దేశాలు ఇలా…: న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్