సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. కనీసం 150 పరుగులైనా దాటుతుందా అని అనిపించినా, చివర్లో బుమ్రా బ్యాట్ కు పనిచెప్పడంతో 185కు ఆలౌటైంది. అంతకుముందు ప్రధాన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లడంతో 148 పరుగులకే ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది టీమ్ఇండియా. జైస్వాల్(10), రాహుల్(4), గిల్(20), కోహ్లి(17), పంత్(40), జడేజా(26), నితీశ్(0), వాషింగ్టన్(14), ప్రసిద్ధ్ కృష్ణ(3), బుమ్రా(23) ఔట్ కాగా.. సిరాజ్(3) నాటౌట్ గా మిగిలాడు. కంగరూ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లైయన్ 1 వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఖవాజా(2)ను బుమ్రా ఔట్ చేయగా, శామ్ కోన్స్టాస్(7) క్రీజులో ఉన్నాడు.