ప్రపంచకప్ గెలిచిన మరునాడే(Next Day) స్వదేశానికి రావాల్సిన టీమ్ఇండియా ప్లేయర్లు.. వెస్టిండీస్ లో భారీ హరికేన్(Hurricane) కారణంగా బార్బడోస్ లోనే ఐదు రోజుల పాటు చిక్కుకుపోయారు. కేంద్రప్రభుత్వం పంపిన ప్రత్యేక ఫ్లైట్ ద్వారా ఆటగాళ్లంతా నిన్న బయల్దేరి ఈరోజు పొద్దున 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు.
ప్రధానిని కలవనున్న టీం సభ్యులు సాయంత్రం ముంబయి చేరుకుంటారు. అక్కడ BCCI ఆధ్వర్యంలో ఓపెన్ టాప్ బస్ ద్వారా నిర్వహించే రోడ్ షోలో ఆటగాళ్లు పాల్గొంటారు
షెడ్యూల్ ఇలా…
ఉదయం 9 గంటలు…: ఐటీసీ మౌర్య హోటల్ నుంచి ప్రధాని ఆఫీసు
మధ్యాహ్నం 12 గంటలు…: ప్రధాని కార్యాలయం నుంచి హోటల్ ఐటీసీ మౌర్య
మధ్యాహ్నం 12:30 గంటలు…: హోటల్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం
సాయంత్రం 5 గంటలు…: ముంబయి వాంఖడే స్టేడియానికి చేరిక
సాయంత్రం 5-7 గంటలు…: వాంఖడే స్టేడియం నుంచి ఓపెన్ బస్ పరేడ్
రాత్రి 7-9 గంటలు…: వాంఖడే స్టేడియంలో వేడుక, సన్మానం
రాత్రి 9:30 గంటలు…: వాంఖడే నుంచి తాజ్ హోటల్