ముందుగా అనుకున్నట్లుగా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్(Head Coach)గా నియామకమయ్యాడు. ఈ విషయాన్ని BCCI కార్యదర్శి జై షా ప్రకటించారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో అతడు మరో రెండేళ్ల పాటు పనిచేస్తాడు.
ఈ నెలలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ తో బాధ్యతలు చేపడతాడు. IPL సీజన్లలో కోల్ కతా నైట్ రైడర్స్(KKR) బాధ్యతలు చూస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఇక హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు.