
దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కు భారతజట్టును BCCI ప్రకటించింది. ఈనెల 14న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు పంత్ తిరిగివస్తున్నాడు. జులైలో ఇంగ్లండ్ తో టెస్టులో పాదం ఎముక చిట్లి పంత్ దూరమయ్యాడు. ఇండియా ‘ఏ’తో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అతడు 90 పరుగులు చేసి గెలిపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న జట్టులో చాలా మందికి చోటు దక్కింది.
జట్టు ఇదే…: శుభ్ మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా,
అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్