అసలే అంతంతమాత్రంగా ఆడుతున్న భారత జట్టు(Team India)కు ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసుకుని కోలుకోకుండా చేశాడు. 72కే నాలుగు వికెట్లు పడ్డ టీంను రిషభ్ పంత్(40), జడేజా ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మళ్లీ సహనం కోల్పోయిన పంత్.. బోలాండ్ వేసిన బాల్ ను షాట్ కొట్టబోయి కమిన్స్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికే నితీశ్(0) డకౌట్ కావడంతో 120కే 6 వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది. మొత్తంగా జైస్వాల్(10), కోహ్లి(17), పంత్, నితీశ్ వికెట్లను తీసుకున్నాడు బోలాండ్. రాహుల్(4), గిల్(20) సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత జడేజా కూడా ఔటవగా.. మిచెల్ స్టార్క్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.