టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి తిరిగి రావాల్సిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. ఫైనల్ జరిగిన బార్బడోస్(Barbados)లోనే చిక్కుకుపోయారు. తుపానుగా భావించే హరికేన్ ప్రభావంతో వారు హోటళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన బెరిల్(Beryl) అనే హరికేన్ ప్రభావంతో వెస్టిండీస్ లో గంటకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు(Winds) వీస్తున్నాయి.
ఫ్లైట్స్ క్యాన్సిల్…
బార్బడోస్ కు 570 కిలోమీటర్ల దూరంలో తూర్పు-ఆగ్నేయ దిక్కున కేంద్రీకృతమైన హరికేన్ ఈ సాయంత్రానికి బ్రిడ్జిటౌన్ ప్రాంతంలో తీరం దాటనుంది. కేటగిరీ-4 రకానికి చెందిన హరికేన్(Hurricane) వల్ల అన్ని ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమానాలు లేక మనవాళ్లంతా అక్కడే చిక్కుకుపోయారు. వీరిని న్యూయార్క్ నుంచి భారత్ తీసుకురావాల్సిన ఫ్లైట్ దుబాయ్ లోనే ఆగిపోయింది.
ప్రధానితో…
టీంను తీసుకువచ్చే విషయంపై BCCI దృష్టిపెట్టింది. బ్రిడ్జిటౌన్ నుంచి న్యూయార్క్ దాకా తరలించి అక్కణ్నుంచి ఛార్టర్ ఫ్లైట్ ద్వారా భారత్ తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆ ఛార్టర్డ్ ఫ్లైట్ దుబాయ్ మీదుగా ఢిల్లీ వచ్చేలా ప్లాన్ చేస్తుండగా.. ఇందుకోసం ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడేందుకు BCCI వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.