
తొలుత బ్యాటింగ్ చేసి టపటపా వికెట్లు పోగొట్టుకుని తక్కువ స్కోరు చేసిన భారత్.. తర్వాత ప్రత్యర్థి నడ్డి విరిచింది. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో టీ20లో 119కి ఆలౌటై 49 రన్స్ తేడాతో ఓడింది. టీమ్ఇండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆ జట్టు 116కే 8 వికెట్లు కోల్పోయింది. 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1తో లీడ్ లో ఉంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో టీ20 లో ఆసీస్ గెలిచింది. మూడు, నాలుగో టీ20ల్ని భారత్ గెలిచింది.
దీంతో ఈ పర్యటనలో తొలిసారి కంగారూల్ని వారి గడ్డపైనే హడలెత్తించారు. బ్యాటింగ్ లో 21 పరుగులు చేసి, తర్వాత 2 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.