ఐర్లాండ్ తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ లో భారత్ విజేతగా నిలిచింది. వర్షం వల్ల ఒక్క బాల్ పడకుండానే మూడో మ్యాచ్ రద్దయింది. దీంతో భారత్ 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐర్లాండ్ పై మొదటి రెండు టీ20లను సొంతం చేసుకున్న బుమ్రా సేన.. మూడో మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేద్దామనుకుంది. డబ్లిన్ లో మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వాన మొదలైంది. టాస్ వేసే అవకాశం కూడా లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఫస్ట్ టీ20 మ్యాచ్ లోనూ వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. దీంతో టీమ్ఇండియా డక్ వర్త్ లూయిస్ సిస్టమ్ ఆధారంగా 2 రన్స్ తేడాతో విజయం సాధించింది. 11 నెలల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ లాడిన బుమ్రా.. ఈ సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు.