
పాకిస్థాన్ తో సూపర్-4 మ్యాచ్ లో అదరగొట్టిన తర్వాత పూర్తి రిలాక్స్(Relax) గా మారిపోయాడు KL రాహుల్. నిన్నటి మ్యాచ్ ముందటి వరకు పూర్తి ఆందోళనలో ఉన్న ఈ ప్లేయర్.. దాయాది పోరులో రాణించడంతో ఆయన పట్ల అందరిలోనూ పాజిటివ్ థింకింగ్ కనిపిస్తున్నది. అయితే రాహుల్ ఆడతాడన్నది చివరి వరకు అంటే మ్యాచ్ మొదలయ్యే వరకు అతడికి తెలియదట. ఈ విషయాన్ని కేవలం టాస్ కు 5 నిమిషాల ముందు మాత్రమే టీమ్ మేనేజ్మెంట్ చెప్పిందట. ‘రాహుల్ నువ్వు ఈ మ్యాచ్ కోసం రెడీ’గా ఉండాలంటూ 5 మినిట్స్ ముందే చెప్పారట. దీన్ని బట్టే అర్థమవుతుంది జట్టులో ఎంతటి కాంపిటీషన్ ఉందో. 15 మంది గల టీమ్ కు ఎంపికైనా తుది-11లో ఉంటారా లేదా అన్నది రాహుల్ కే కాదు.. టీమ్ మేనేజ్మెంట్ కు కూడా సందిగ్ధంగానే ఉందని ఆఖరి నిమిషాల్లో రాహుల్ ను పిలవడాన్ని బట్టి అర్థమవుతుంది. వాస్తవానికి ఈ ఆటగాడి తీరు గత కొన్ని నెలలుగా అలాగే ఉంది.
బ్యాటింగ్ లో పెద్ద స్కోర్లు చేయకపోవడం, గాయాలతో నాలుగు నెలల పాటు జట్టుకు దూరంగా ఉండటం, కుర్ర ప్లేయర్ల నుంచి విపరీతమైన ప్రెజర్ కాంపిటీషన్ నెలకొనడం లోకేశ్ రాహుల్ కు నెగెటివ్ గా తయారైంది. అటు ఆసియా కప్ తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్.. పాక్ పై విరుచుకుపడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ ను పక్కనబెట్టి రాహుల్ తీసుకుంటే ఇక అంతే సంగతులు. అందుకే ఒకవైపు ఇషాన్ ను కొనసాగిస్తూనే లోకేశ్ కు మరో ఛాన్స్ ఇచ్చారు రోహిత్, ద్రవిడ్. ఈ మ్యాచ్ లో గనక రాణించకపోయి ఉంటే రాహుల్ పరిస్థితి దారుణంగా తయారయ్యేదే. కానీ తీవ్ర ఒత్తిడి(Pressure)లోనూ KL… అనన్యసామాన్య ఆటతీరుతో తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకుని జట్టులో తన ప్లేస్ ను పటిష్ఠం చేసుకున్నాడు.