ఆసియా కప్ లో భారత బౌలర్ల దెబ్బకు పసికూన UAE విలవిల్లాడింది. కుల్దీప్ 4, దూబె 3 వికెట్లతో దెబ్బకొట్టడంతో 57కే ఆలౌటైంది. ఓపెనర్లు అలీషాన్(22), వసీమ్(19) ఇద్దరే టాపర్ స్కోరర్లు. 13.1 ఓవర్లలోనే ఆ జట్టు కథ ముగిసింది. తర్వాత ఓపెనర్లు అభిషేక్(30), గిల్(20 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ తో భారీ విజయం సొంతమైంది. సూర్య(7నాటౌట్) వస్తూనే సిక్స్ బాదడంతో 4.3 ఓవర్లలోనే 60 చేసిన భారత్.. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీ20ల్లో బాల్స్ పరంగా భారత్ కు ఇదే అతిపెద్ద విజయం.