ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC)లో భారత జట్టు నంబర్ వన్(Top) స్థానం(Place)లో నిలిచింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో ఆతిథ్య కివీస్ జట్టు ఓటమి పాలు కావడంతో టీమ్ఇండియా తొలి స్థానానికి చేరుకుంది. ప్రతి రెండేళ్ల కాలానికి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్ లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తలపడతాయి. వెల్లింగ్టన్ లో జరిగిన ఫస్ట్ టెస్ట్ లో న్యూజిలాండ్ 172 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓటమి పాలై రెండో స్థానానికి పడిపోయింది.
నాలుగు పాయింట్లకు పైగా…
2023-25 సీజన్ కు గాను భారత్ ప్రస్తుతం 64.58 శాతం విజయాలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీజన్ లో 8 టెస్టులాడిన టీమ్ఇండియా 5 విజయాలు, ఒక పరాజయం, మరో డ్రా తో 64.58 శాతం పాయింట్లు సాధించింది. న్యూజిలాండ్ 36 పాయింట్లు, 60% విజయాలతో రెండో ప్లేస్ లో… ఆస్ట్రేలియా ఎక్కువ మ్యాచ్ లాడి 72 పాయింట్లు పొందినా గెలుపు శాతం 59.09%గానే ఉండిపోవడంతో మూడో ప్లేస్ కు పరిమితమైంది. ఆ జట్టు 11 మ్యాచ్ లకు గాను 7 గెలిచి, మరో మూడు ఓడి ఒకటి డ్రా తో సరిపెట్టుకుంది. బంగ్లాదేశ్ టీమ్ ఆశ్చర్యకరంగా 50% విజయాలతో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.
ర్యాంక్ – జట్టు – విజయాల శాతం
1. భారత్ – 64.58%
2. న్యూజిలాండ్ – 60%
3. ఆస్ట్రేలియా – 59.09%
4. బంగ్లాదేశ్ – 50%
5. పాకిస్థాన్ – 36.60%
6. వెస్టిండీస్ – 33.33%
7. దక్షిణాఫ్రికా – 25%
8. ఇంగ్లండ్ – 19.44%
9. శ్రీలంక – 0.00%