వర్షం అడ్డుపడ్డ వేళ శ్రీలంక విజయావకాశాలు(Winning Chances) దెబ్బతిని గెలుపు భారత్ సొంతమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీ(54)తో 9 వికెట్లకు 161 స్కోరు చేసింది. 162 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ఇండియా కేవలం 3 బంతులే ఆడి 6 పరుగులు చేసిన వేళ.. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. అలా గంట పాటు ఆట తుడిచిపెట్టుకుపోయింది.
డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్దేశించారు. ఆట మొదలైన వెంటనే షాట్ కు ట్రై చేసి శాంసన్(0) ఔటయ్యాడు. ఆ తర్వాత జైస్వాల్, సూర్యకుమార్ జోడీ సెకండ్ వికెట్ కు 39 పరుగులు జోడించిన తర్వాత సూర్య(26), జైస్వాల్(30) వెనుదిరిగారు.
మిగతా లాంఛనాన్ని పాండ్య(22 నాాటౌట్) పూర్తి చేయడంతో 81/3తో నిలిచి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది భారత్. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ 2-0తో సూర్యకుమార్ సేన సొంతమైంది.