ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో వరుస ఓటములతో టీమిండియాపై విమర్శలు వస్తుండగా టెస్టు కెప్టెన్ పదవిపై చర్చ నడుస్తోంది. రోహిత్ తర్వాత ఎవరు అంటూ క్రికిట్ ఫ్యాన్స్ తోపాటు మాజీ ప్లేయర్స్ కూడా కొంతమంది సీనియర్ల పేర్లు చెబుతున్నారు. రహానే, జడేజా, అశ్విన్, బుమ్రా, కోహ్లి ఇలా ఈ పేర్లే రెగ్యులర్ గా వినపడుతున్నాయి. కానీ గూగుల్ AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాత్రం పూర్తి భిన్నమైన ఆన్సర్ ఇచ్చింది. ఫ్యూచర్ లో జట్టుకు ఉపయోగపడే పేర్లనే రికమెండ్ చేసింది. రోహిత్ కు 36 ఏళ్లు కాబట్టి మరో డబ్ల్యూటీసీ ఫైనల్ కు 38కి చేరుకుంటాడు. అప్పటివరకు ఫిట్ నెస్ లోపమో లేదంటే నార్మల్ గానే జట్టులో కొనసాగడం కష్టమే.
Google AI పేర్లివే
Google AI తన తొలి ఆప్షన్ ను ఓపెనర్ కేఎల్ రాహుల్ కు ఇచ్చింది. రాహుల్ ఇప్పటికే కెప్టెన్ గా బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ గెలుచుకున్నాడు. వైస్ కెప్టెన్ గానూ పనిచేశాడు. ఫామ్ లేక ప్రస్తుత టీంలో స్థానం కోల్పోయినా ఏజ్ ను బట్టి కేఎల్ ను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక రెండో ఆప్షన్ గా Google AI వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ఓకే చెప్పింది. గతేడాది కారు యాక్సిడెంట్ కు గురై ప్రస్తుతం కోలుకుంటున్న రిషభ్.. ఏడాది పాటు క్రికెట్ ఆడే అవకాశం కనిపించట్లేదు. గతంలో టీ20లకు కెప్టెన్ గా ఉన్న పంత్.. మూడు ఫార్మాట్లలోనూ ఫేమస్ బ్యాటర్ గా ఉన్నాడు. అందుకే పంత్ కు Google AI ఓకే చెప్పింది. ఇక థర్డ్ ఆప్షన్ శుభ్ మన్ గిల్ అట. గత కొంతకాలంగా దుమ్మురేపుతున్న గిల్.. ఐపీఎల్ టాపర్ గా ఉన్నా WTC ఫైనల్లో ఫెయిలయ్యాడు. అయినా అతణ్ని తక్కువ అంచనా వేయొద్దని, మంచి బ్యాటింగ్ టెక్నిక్స్ ఉన్న గిల్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా ద బెస్ట్ అని Google AI చెప్పింది.