దాయాదుల పోరు(India-Pak) ఎలా ఉంటుందో, టికెట్లకు ఎంత డిమాండ్ ఉందనేందుకు భారత్-పాకిస్థాన్ మ్యాచులే ఉదాహరణ. ఈ నెల 19 నుంచి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం ఈ రెండు దేశాల మ్యాచుల టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. టీమ్ఇండియా ఆడే మూడు లీగ్ మ్యాచులతోపాటు తొలి సెమీఫైనల్ టికెట్లను ICC.. సోమవారం నుంచి అందుబాటులో ఉంచింది. దుబాయిలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మొదలయ్యాయి. ఈ నెల 20న బంగ్లాదేశ్, 23న పాక్, మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ ఆడుతుంది. ఈ ఫలితాల ఆధారంగా టీమ్ఇండియా ముందంజ వేస్తే తొలి సెమీఫైనల్ ఉంటుంది. టికెట్ కనీస ధర 125 UAE దిర్హామ్(రూ.2,900)లుగా నిర్ణయించింది. దుబాయి స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియంలో 25,000 సీటింగ్ సామర్థ్యం(Capacity) ఉంది. ఆన్లైన్ లో టికెట్ల కోసం 2 లక్షల మందికి పైగా పోటీపడటంతో 25 వేల టికెట్లు గంటలోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.