
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు(Team India) ఈరోజు నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. ఇప్పటికే రెండు జట్లు 1-1తో సమంగా ఉండగా.. ఇవాళ్టి మ్యాచ్ తో సిరీస్ విజేత ఎవరో తేలిపోనుంది. మొదటి వన్డేలో ఈజీ(Easy)గా గెలిచినా రెండో వన్డేలో మన జట్టు ఘోరంగా పరాజయం పాలైంది. అనుభవం లేని జట్టుతో దారుణంగా చతికిలపడ్డ తీరు విమర్శలకు దారితీసింది. IPLలో అదరగొట్టిన కుర్రాళ్లు వెస్టిండీస్ లో మాత్రం పూర్తిగా ఫెయిలయ్యారు. ఒక్క ఇషాన్ కిషన్ తప్ప మిగతా వారెవరూ కనీసం రెండంకెల స్కోరు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. భారత జట్టు ఆటతీరుపై మాజీలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, వెంకటేశ్ ప్రసాద్ ఇప్పటికే టీమ్ ఇండియా తీరుపై విమర్శలు గుప్పించారు. ఆటగాళ్లలో గెలవాలన్న దృక్పథమే కనిపించడం లేదని మండిపడ్డారు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.