
ఫస్ట్ టీ20లో ఘోర పరాజయం పాలైన భారత జట్టు నేడు వెస్టిండీస్ తో రెండో మ్యాచ్ ఆడనుంది. బ్యాటర్లు పూర్తిగా విఫలమవడంతో బోల్తా పడ్డ టీమ్ ఇండియా రెండో టీ20లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తున్నది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్ లో అందరికీ మంచి ఎక్స్ పీరియన్స్ ఉన్నా ఏ ఒక్కరూ గట్టిగా నిలబడలేకపోవడంతో విండీస్ చేతిలో ఓటమి తప్పలేదు. IPLలో అదరగొట్టిన కుర్ర ప్లేయర్లు మళ్లీ అదే తీరు బ్యాటింగ్ కొనసాగిస్తే గెలుపు పెద్ద కష్టం కాబోదు. ఒక్క తిలక్ వర్మ మినహా అందరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. కాబట్టి టీమ్ ఇండియా పూర్తి శక్తియుక్తులు ప్రదర్శించి ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ లో తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. అటు కరీబియన్ జట్టు కూడా పొట్టి ఫార్మాట్ కు వచ్చేసరికి పటిష్ఠంగా కనిపిస్తున్నది.
ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యతో పటిష్ఠంగా కనిపిస్తున్న భారత జట్టుకు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లున్నారు. అందులో కొందరు నిలబడ్డా విజయం పెద్ద కష్టం కాబోదు కాబట్టి బ్యాటర్లు రాణించాల్సిన అవసరముంది.