భారత క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ క్రికెట్ లో మూడు ఫార్మాట్ల(టెస్టులు, వన్డేలు, టీ20లు)లో నంబర్ వన్ గా నిలిచిన రికార్డును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాపై తాజా గెలుపుతో వన్డేల్లో పాకిస్థాన్ ను వెనక్కు నెట్టి భారత్ వరల్డ్ టాపర్ గా నిలిచింది. భారత్ ఖాతాలో 116 రేటింగ్ పాయింట్లు ఉండగా.. 115 పాయింట్లతో పాక్ సెకండ్ ప్లేస్ లో ఉంది. 111 పాయింట్లతో కంగారూ జట్టు థర్డ్ ప్లేస్ దక్కించుకుంది.
అటు 264 రేటింగ్ పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్ లోనూ టీమ్ఇండియా టాప్ పొజిషన్ లో ఉంది. 259 పాయింట్లతో ఇంగ్లండ్, 255 పాయింట్లతో న్యూజిలాండ్, 254 పాయింట్లతో పాకిస్థాన్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఇప్పటికే టెస్టుల్లో మన జట్టు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. 2, 3 ప్లేస్ ల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఉన్నాయి.