భారత్ కు వన్డే ప్రపంచకప్(World Cup) దూరం చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్… IPLల్లో రెచ్చిపోయాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB)తో జరిగిన మ్యాచ్ లో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఫోర్లు, సిక్స్ లతో చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) కేవలం 39 బాల్స్ లోనే 100 మార్క్ ను దాటాడు.
41 బంతుల్లో…
ఓపెనర్ ట్రావిస్ హెడ్(102; 41 బంతుల్లో 9×4, 8×6) బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. 102 స్కోరులో 84 రన్స్ ఫోర్లు, సిక్స్ ల ద్వారా వచ్చినవి కావడం చూస్తే ట్రావిస్ విధ్వంసం అర్థమవుతుంది. 20 బాల్స్ లోనే హెడ్ ఫిఫ్టీ చేస్తే, 4.3 ఓవర్లలోనే హైదరాబాద్ స్కోరు 50 దాటింది. 11.2 ఓవర్లలో 150 మార్క్ ను రీచ్ కాగా.. హెడ్, అభిషేక్ శర్మ(34; 22 బంతుల్లో 2×4, 2×6) జోడీ 43 బాల్స్ లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది.