చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఐపీఎల్ సీజన్ ముగియడంతో… వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మధ్యనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వివాహం చేసుకోగా… ఇప్పుడు తుషార్ దేశ్ పాండే ఆ దిశగా ముందడుగు వేశాడు. మొన్నటి సీజన్లో సత్తా చాటిన సీఎస్కే పేస్ బౌలర్ తుషార్ పాండే… ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన నభా గద్దంవార్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. 28 ఏళ్ల ఈ మహారాష్ట్ర సీమర్… నభాతో సోమవారం నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుందని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి.