జాతీయ జట్టు అసిస్టెంట్, ఫీల్డింగ్(Fielding) కోచ్ లు సహా ముగ్గురిపై వేటు వేస్తూ BCCI సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాగా.. ఫీల్డింగ్ కు దిలీప్, అసిస్టెంట్ కోచ్ గా అభిషేక్ నాయర్ ఉన్నారు. ట్రెయినర్ సోహమ్ ను సైతం విధుల నుంచి తొలగించింది. ఇద్దరికీ మూడేళ్ల కాలం పూర్తి కాగా.. కేవలం 8 నెలలకే నాయర్ పదవి ఊడింది. ఆస్ట్రేలియా టూర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతోపాటు భారత్ లోనే న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా ఓడిపోయింది. ఓడిపోయింది. వరుస టెస్ట్ సిరీస్ వైఫల్యాలతోపాటు డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్ కావడంపై బోర్డు ఆగ్రహం చెందింది. ట్రెయినర్ సోహమ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లీ రోక్స్ బాధ్యతలు చూస్తారు. ఫీల్డింగ్, అసిస్టెంట్ కోచ్ పదవులు మాత్రం ఖాళీగా ఉంటాయి.