భారత యువ క్రికెటర్ వైభవ్(Vaibhav) సూర్యవంశీ(143; 78 బంతుల్లో 13×4, 10×6) విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్ లో జరుగుతున్న అండర్-19 యూత్ నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టుపై అలవోకగా సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పూర్తి చేశాడు. అతడు ఔటయ్యాక విహాన్ మల్హోత్రా(129) దాడి మొదలైంది. ఈ ఇద్దరూ సెంచరీలతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ పై 363/9 పరుగుల భారీ స్కోరు చేసింది యువ టీమ్ఇండియా.