
14 ఏళ్ల చిన్నోడు వైభవ్ సూర్యవంశీ(Suryavanshi) ఆకాశమే హద్దుగా సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి ఔటయ్యాడు. అందులో 15 సిక్సర్లు, 11 బౌండరీలున్నాయి.
ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో UAE బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో 3 సిక్సులు, పదో ఓవర్లో ఒక ఫోర్, నాలుగు సిక్సులు బాది చుక్కలు చూపించాడు. అతడి ధాటికి భారత్-A జట్టు 13.1 ఓవర్లలోనే 200 స్కోరు చేసింది. మిగతా ప్లేయర్లు ప్రియాన్ష్ ఆర్య(10), నమన్ ధిర్(34), నేహల్ వధేరా(14) చేశారు. UAE బౌలర్లలో హర్షిత్ కౌశిక్ ఒక్క ఓవర్లో 30, మహ్మద్ జవాదుల్లా 2 ఓవర్లలో 40, ఫరాజుద్దీన్ 4 ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్నారు. దీన్నిబట్టే వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థమవుతుంది.