ఆడుతుంది మూడో మ్యాచ్… ఎదురుగా దిగ్గజ బౌలర్… అయినా ఏ మాత్రం బెదరలేదా పద్నాలుగేళ్ల చిన్నోడు. గుజరాత్ బౌలర్ ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. 6, 6, 4, 0, 6, 1w, 1w, 4 ఇలా వైభవ్ సూర్యవంశీ ధాటికి ఇషాంత్ చిన్నబోయాడు. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్లర్లతో హాఫ్ సెంచరీ చేరుకుని, ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ నెల 19న సూపర్ జెయింట్స్ మ్యాచ్ తో IPLలో అడుగుపెట్టి 34 పరుగులు చేసిన వైభవ్.. ఏప్రిల్ 24న బెంగళూరుపై 16 రన్స్ చేశాడు.