ఒలింపిక్స్(Olympics) కచ్చితంగా బంగారు పతకం వస్తుందని భావిస్తున్న ఈవెంట్లో భారత్ కు భారీ షాక్ తగిలింది. రెజ్లింగ్ మహిళల 50 కేజీల ఫ్రీ-స్టైల్ లో ఇప్పటికే ఫైనల్ చేరిన వినేశ్ ఫొగాట్ పై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(IOA) అనర్హత వేటు వేసింది. అధిక బరువు(Over Weight) కారణంగా ఆమెపై వేటు వేసినట్లు IOA ప్రకటించింది.
ఫైనల్ మ్యాచ్ కు ఆమెపై అనర్హత వేటు పడటంతో రెజ్లింగ్ లో భారత్ పతకం ఆశలు ఆవిరయ్యాయి. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆమె బరువు పరిశీలిస్తే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బరువు పెరగడంతోనే వినేశ్ ఫొగాట్ డిస్ క్వాలిఫై అయినట్లు చెబుతున్నారు.