
విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. చివర్లో అశ్విన్(56; 78 బంతుల్లో 8×4) మినహా ఎవరూ పెద్దగా స్కోరు చేయకపోవడంతో 438 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా(61; 152 బంతుల్లో 5×4) రాణించగా.. ఇషాన్ కిషన్(25) తొందరగానే పెవిలియన్ బాట పట్టాడు. 288/4తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమ్ ఇండియా.. భారీ స్కోరు సాధించడంలో కోహ్లి(121; 206 బంతుల్లో 11×4) కీలక పాత్ర పోషించాడు. కీమర్ రోచ్, జోమెల్ వేరికాన్ తలో మూడు వికెట్లు.. జేసన్ హోల్డర్ 2, షెనాన్ గాబ్రియేల్ 1 వికెట్ తీసుకున్నారు.
ఇక ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్ వికెట్ నష్టానికి 86 రన్స్ చేసింది. బ్రాత్ వైట్(37 నాటౌట్ ), మెకంజీ(14) క్రీజులో ఉన్నారు. తొలి టెస్టులో టపటపా వికెట్లు కోల్పోయినా రెండో టెస్టులో విండీస్ ప్లేయర్లు నిదానంగా ఆడుతున్నారు.