విరాట్ కోహ్లి అంటే స్వదేశంలోనే కాదు విదేశాల్లో(Foreign)నూ విపరీతమైన అభిమానులు(Fans)న్నారు. చివరకు దాయాది దేశమైన పాకిస్థాన్ లోనూ వీరాభిమానులున్నారు. అసలే దూకుడుకు మారుపేరు.. ఫైనల్లో 76 పరుగులతో వరల్డ్ కప్ గెలవడంలోనూ మెయిన్ రోల్. ఇక కోహ్లి ఇన్స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ పెడితే అది కొద్ది గంటల్లోనే రికార్డు క్రియేట్ చేసింది.
ఏంటా పోస్ట్…
టీమ్ఇండియా ప్రపంచకప్ అందుకున్న ఫొటోను షేర్ చేస్తూ… ‘ఇంతకంటే మంచిరోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. దేవుడు గొప్పవాడు.. నేను భగవంతుడి ఎదుట కృతజ్ఞతతో తలవంచుకుంటాను.. మేము చివరకు(Finally) సాధించాం(Got It)..’ అని రాశాడు. ఆ ఎమోషనల్ పోస్టును 19 లక్షల మంది వీక్షించారు. అతడి పోస్టును సామాన్యులే కాదు అంతర్జాతీయ సెలబ్రిటీ ప్లేయర్లయిన MMA ఫైటర్ కానర్ మెక్ గ్రెగర్, బ్రెజిలియన్ ఫుట్ బాలర్ వినిసియస్ కొనియాడారు.
పాత రికార్డును…
బాలీవుడ్ జోడీ కియారా అద్వాణి-సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి పోస్టుపై ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ రికార్డుస్థాయి వ్యూయర్ షిప్ ఉంది. కోహ్లి పోస్ట్ ఇప్పటిదాకా 20.40 లక్షల వ్యూహర్ షిప్ కు చేరుకుంది. దీంతో కియారా-మల్హోత్రా రికార్డు కనుమరుగైంది. ఒక అపురూప విజయం(పొట్టి ప్రపంచకప్)తో కోహ్లి తన టీ20 కెరీర్ ను ముగించాడు.